హైదరాబాద్: తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలో తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్ సీజన్ 9లో జాను లిరి పాల్గొంటుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ ఊహాగానాలపై జాను లిరి తాజాగా స్పందిస్తూ తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఒక ఇంటర్వ్యూలో జాను మాట్లాడుతూ, గతంలో రెండు సీజన్ల కోసం షో నిర్వాహకుల నుంచి తనకు పిలుపు వచ్చిందని, అయితే తాను వాటిని తిరస్కరించానని వెల్లడించింది. అటువైపు లక్షల్లో రెమ్యునరేషన్ వస్తుందంటే కూడా వెళ్లవా అని హోస్ట్ ప్రశ్నించగా, “జానును డబ్బుతో కొనలేరు” అంటూ నవ్వేసింది. ఆమె మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
జాను లిరి తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు, ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “బంగారం లాంటి ఛాన్స్ వస్తే కాలితో తంతుదేంటి ఈ పిల్ల” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తన నియమాలకు, నిర్ణయాలకు కట్టుబడి ఉండే జాను లిరి, భారీ పారితోషికాన్ని సైతం లెక్కచేయకుండా బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.































