ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎందుకూ పనికి రాని వాడిలా చూస్తారు జనాలు..అంతెందుకు ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ లేకపోతే అసలు పెళ్లి చేసుకోడానికి పిల్లను కూడా ఇవ్వట్లేదు.. అది ప్రభుత్వ జాబ్‌కు ఉన్న డిమాండ్. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడాలి.

అలాంటిది తనకు నచ్చిన రంగం కోసం కష్టపడి సాధించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు ఓ జబర్దస్త్ కమెడియన్. అతను ఎవరో కాదు అప్పట్లో పటాస్‌.. ఇప్పుడు జబర్దస్త్ షోలో పంచ్‌లు పేలుస్తూ ఫన్ ఇస్తున్న నూకరాజు.పటాస్ కామెడీ షోతో నూకరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే పటాస్ తర్వాత జబర్దస్త్‌లో కమెడియన్‌గా అవకాశం పొందాడు. అయితే పటాస్ కంటే ముందు జీ తెలుగులో ఒక కామెడీ షో కూడా చేశాడు నూకరాజు.

ప్రస్తుతం జిగేల్ జీవన్ టీంలో చేస్తూ పంచ్‌లు పేలుస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పర్సనల్ విషయాలు చెబుతూనే.. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రాకముందు ఏం చేసేవాడో చెప్పుకొచ్చాడు. పటాస్ షోకు రాకముందు విజయవాడ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్ అవకాశాల కోసం ట్రై చేశాడు. అలాంటి సమయంలో జీ తెలుగులో ఒక కామెడీ షోలో అవకాశం వచ్చింది.

ఉద్యోగం చేస్తూ కామెడీ షోలో నటించడం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి.. నచ్చిన రంగంవైపే అడుగులు వేశా. అని ఆ ఇంటర్వ్యూలో నూకరాజు చెప్పుకొచ్చాడు. నూకరాజు మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా చాలా మంది తమకు వచ్చిన బంగారం లాంటి అవకాశాలను వదులుకొని నచ్చిన సినిమా రంగం కోసం వచ్చి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here