Rohini: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. కేవలం చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా ఇలాంటి ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటు ఉన్నారు కానీ ఇండస్ట్రీలో ఈ ఇబ్బందులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తాము క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ పలు సందర్భాలలో ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి రోహిణి సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తాను కూడా ఇలాంటి వాటికి బాధితు రాలేనని ఈమె తెలిపారు. కెరియర్ మొదట్లో అవకాశాలు కోసం చాలామంది దగ్గరకు వెళ్లాను.
ఇలా అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళగా వారందరూ మాకేంటి లాభం అంటూ ఎదురు ప్రశ్న వేసేవారని తెలిపారు. ఇలా ఓ సినిమా ఆడిషన్ కోసం వెళ్తే అక్కడ తండ్రి వయసు ఉన్నటువంటి ఓ వ్యక్తి ఈ అవకాశం ఇస్తే నాకేంటి లాభం అని అడిగారు. ఆ ఒక్క మాటతో తాను వెను తిరిగి వచ్చేసానని తెలిపారు.
తప్పుడు మార్గంలో వెళ్లలేదు..
ఇలా తాను కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాను తప్ప ఎప్పుడూ కూడా తప్పుటడుగులు వేయలేదని ఈ సందర్భంగా రోహిణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బుల్లి తెరపై తన ప్రయాణం మొదలు పెట్టినప్పటికీ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమము ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.



























