Jabardasth Bhanu:బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రచారం మొత్తం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈటీవీలో ఇప్పటికే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయగా ప్రస్తుతం ఇదే టీం నుంచి లిటిల్ హార్ట్స్ అనే మరొక కార్యక్రమం కూడా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమం బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14వ తేదీ సాయంత్రం ప్రారంభం కానుంది. ఇక ఈ కార్యక్రమానికి కమెడియన్ హైపర్ ఆది వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎంతోమంది సీరియల్ నటీమణులు వారి పిల్లలతో ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై పిల్లలు,వారి పేరెంట్స్ పెద్ద ఎత్తున పోటీపడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ భానుకి పల్సర్ బైక్ ఫేమ్ సింగర్ రమణ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా తన పాటతో జబర్దస్త్ భానును ఇంప్రెస్ చేశారు. అదేవిధంగా వేదికపై ఆమెకు ప్రపోజ్ చేయడం గమనార్హం.

Jabardasth Bhanu: యాంకర్ గా హైపర్ ఆది…
ఈ విధంగా రమణ జబర్దస్త్ భానుకి ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి కాగా పూర్తి ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెరిగాయి. మరి లిటిల్ హార్ట్స్ అంటూ ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనే విషయం తెలియాల్సి ఉంది. కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది యాంకర్ గా ఎలా ఆదరణ పొందుతారో తెలియాల్సి ఉంది.































