Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈయన గత ఎన్నికలలో పోటీ చేశారు అయితే కేవలం జనసేన పార్టీకి ఒకే ఒక సీటు లభించింది. పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం రెండు చోట్ల పోటీ చేశారు అయితే ఈ రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ కి గెలుపు అందుకోలేకపోయారు.

ఇక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని భావించారు. అందుకే తన సొంత సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గపు ఓట్లు అధికంగా ఉన్నచోట ఈయన పోటీకి దిగారు. ఇలా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.
ఎలాగైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జబర్దస్త్ టీం తో పాటు మెగా హీరోలు ఇతర సెలబ్రిటీలు కూడా పిఠాపురం చేరుకొని ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ వారందరూ కూడా పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ప్రచారాలకు రాలేదని వారు తమ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని ప్రచారానికి వచ్చారు. కనుక అక్కడ తీసుకున్నటువంటి డబ్బును ఇక్కడ కూడా తీసుకుంటున్నారని కొన్ని కోట్లలో డీల్ కుదుర్చుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
నిజాయితీపరుడు..
ఈ వార్తలపై ఇటీవల రాజు యాదవ్ సినిమా ఈవెంట్లో గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చారు. మేము ప్రచారానికి ఎలాంటి డబ్బు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి అభిమానం ఆయన పట్టుదల నిజాయితీ చూసి ప్రచారానికి వచ్చామని తెలిపారు. మీకు ఇంకా అనుమానం ఉంటే మా బ్యాంక్ అకౌంట్ ఇస్తాం చెక్ చేసుకోండి అంటూ క్లారిటీ ఇచ్చారు.





























