Jabardasth Faima: బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఈ కార్యక్రమం మొదట్లో మగవారే లేడీ గెటప్స్ లో నటించేవారు.అయితే ప్రస్తుతం లేడీ కమెడియన్స్ కూడా ఈ వేదికపై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఫైమా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీమ్ లో సందడి చేస్తున్నారు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం లోకి వచ్చిన తర్వాత తన అద్భుతమైన కామెడీ టైమింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పైమా కొన్నిసార్లు వినూత్న ప్రదర్శన చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం పంటితో ఏకంగా సిలిండర్ ని పైకెత్తి అందరిని ఆశ్చర్యపరిచిన ఫైమా తాజాగా పళ్లతో స్కూటీని పైకి లేపింది. తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో ఈమె స్కూటీ ఎత్తడం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఫిదా అవుతున్న నెటిజన్స్…
ఫైమా టాలెంట్ చూసిన నెటిజన్లు ‘‘ ఫైమా ఆసమ్ అసల్ ❣️’’.. ‘‘ ఫైమా కామెడి టైమింగ్ వేరే లెవలే వేరు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫైమా తన మల్టీ టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే ఫైమా అసలు టాలెంట్ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.































