Jabardasth Komaram: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొంది ఇండస్ట్రీలో మంచి స్థాయిలో నిలదొక్కుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన ఎంతో మంది ప్రస్తుతం వెండితెరపై అవకాశాలను అందుకుంటూ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో జబర్దస్త్ కొమరం అలియాస్ కొమురక్క ఒకరు. జబర్దస్త్ కొమరం తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు.

ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ తమ భార్యలతో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొమరం తన భార్య రజిత గురించి చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.తన భార్య రజిత లేకపోతే తాను ఇక్కడ ఉండే వాడిని కాదంటూ తన కన్నీటి కష్టాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.నాకు ఇండస్ట్రీలో ఉండటం అంటే ఎంతో ఇష్టం తన ఇష్టాన్ని తెలుసుకున్న తన భార్య రజిత తనను ఎంతగానో ప్రోత్సహించింది.

మూడు సంవత్సరాల పాటు నువ్వు అవకాశాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తావు చేయి అని తనకు సపోర్ట్ చేశారు అంటూ తెలిపారు. ఈ విధంగా మూడు సంవత్సరాల పాటు భార్య పిల్లలు అందరినీ వదిలి ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వచ్చాను. అయితే ఐదు సంవత్సరాల పాటు రజిత నా కోసం రాత్రి పగలు కష్టపడుతూ మిషన్ కుట్టి ప్రతి నెల తనకు మూడు వేల రూపాయలు డబ్బులు పంపించేది.
నా భార్య లేకపోతే నేనులేను….
ఈ విధంగా నాకు ఇష్టమైన రంగంలో నిలదొక్కుకోవడానికి తాను ఎన్నో త్యాగాలు చేసిందని, తన వల్లే నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానని కొమరం చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నా భార్య సపోర్ట్ నాకు లేకపోతే నేను ఏమై పోయే వాడినో,నా జీవితం ప్రస్తుతం ఇలా ఉంది అంటే అందుకు కారణం నా భార్య రజిత అంటూ తన భార్య గురించి ఎంతో గొప్పగా చెబుతూ కొమరం వేదికపై ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.




























