Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణికి సర్జరీ.. 10 గంటల పాటు శ్రమించి రాడ్డు తొలగించిన డాక్టర్లు..!

0
207

Jabardasth Rohini: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఆకట్టుకున్న రౌడీ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట బుల్లితెర మీద ప్రసారమైన సీరియల్స్ లో నటిస్తూ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన రోహిణి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో అవకాశం దక్కించుకొని తన కామెడీతో, పంచులతో ప్రేక్షకులను నవ్వించి లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందింది.

ఇలా జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి కుటుంబ విషయాల గురించి అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన కాలుకి సర్జరీ చేసిన విషయం కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.

గతంలో యాక్సిడెంట్ జరిగిన సమయంలో రోహిణి కాలేజీ రావటం వల్ల డాక్టర్లు రాడ్డు వేశారు. అయితే చాలాకాలంగా కాలులో రాడ్డు ఉండటం వల్ల రోహిణి కి ఇబ్బందిగా ఉండటంతో ఇటీవల డాక్టర్ని సంప్రదించి రాడ్డు తొలగించాలని వేడుకుంది. అయితే కాలులో రాడ్డు కూరుకుపోవడంతో దానిని తొలగించడం కష్టమనే డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో తనకు యాక్సిడెంట్ అయినపుడు చికిత్స చేసిన డాక్టర్ ని సంప్రదించడానికి విజయవాడ వెళ్ళినట్లు రోహిణి తెలిపింది.

Jabardasth Rohini: రాడ్ తొలగించిన వైద్యులు…


ఇక డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి దాదాపు 10 గంటల పాటు శ్రమించి సర్జరీ చేసి రోహిణి కాలులో ఉన్న రాడ్డుని తొలగించినట్లు ఆమె తెలిపింది. ఆరు వారాల పాటు కాలు కదపకుండా రెస్ట్ తీసుకోవాలని .. కాలుపై ఎలాంటి బరువు పెట్టవొద్దని డాక్టర్లు సూచించినట్లు తెలిపింది. తన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ సెట్ లోకి అడుగు పెడతానని రోహిణి చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన ఆమె స్నేహితులు, అభిమానులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.