Jabardasth Shabeena: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ షబీనా… వైరల్ అవుతున్న ఫోటోలు?

0
213

Jabardasth Shabeena: షబీనా అంటే గుర్తు పట్టకపోవచ్చు గాని జబర్దస్త్ షబీనా అంటే టక్కున ఈ సొట్ట బుగ్గల సుందరి అందరికీ గుర్తొస్తుంది. ఒకానొక సమయంలో జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను సందడి చేసేవారు అయితే రాను రాను ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లేడీ కమెడియన్స్ కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో షబీనా ఒకరు.

ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పలు తెలుగు సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే తెలుగులో ప్రసారమవుతున్న కస్తూరి, ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కొన్ని రోజులపాటు కెవ్వు కార్తీక్ టీంలో సందడి చేసిన షబీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.

Jabardasth Shabeena: కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న నటి…

మున్నా అనే వ్యక్తిని షబీనా వివాహం చేసుకోబోతుందనీ సరిగ్గా జూలై 17వ తేదీ వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిందని ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈమె నిశ్చితార్థ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేస్తూ జులై 17 ఎప్పటికీ మర్చిపోలేని రోజు అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇక త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.