వర్ష అంటే ఎవరికీ తెలియకపోవచ్చు..కానీ జబర్దస్త్ వర్ష అంటే ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ తెలుసు. అంతలా పేరు తెచ్చుకున్నారు వర్ష. జబర్దస్త్ లో ఎంట్రీ తర్వాత అమ్మడు పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ షో మరే లేడీ కమెడీయన్‌కి ఈ రేంజ్‌లో పాపులారిటీ, క్రేజ్ రాలేదంటే అతిశయోక్తి కాదు. అంతగా తనదైన కామెడీ, అందంతో మెస్మరైజ్ చేసింది.ఇమ్మాన్యుయెల్‌లో కలిసి ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వారిద్దరి జంట బాగా కుదిరిందని.. ప్రేక్షకులు కూడా వీళ్లద్దరు చేసే కామెడీ.. కెమిస్ట్రీ బాగా ఇష్టపడుతున్నట్లు సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వచ్చాయి.

దీంతో వీళ్ల స్కిట్ కు బాగా వ్యూస్ రావడం కూడా జరిగింది. దీంతో వీరిద్దరి పెయిర్ కొనసాగింది. ఒకరిని విడిచి, మరొకరు ఉండలేరనేంతగా, వీరిద్దరు కలిసి చేయకపోతే ఆ స్కిట్ కూడా పండదనేంతగా వీరికి ఆడియెన్స్ లో ఇమేజ్‌ని, క్రేజ్ ఏర్పడింది. అయితే ఆమెపై ఇటీవల నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారని.. అసహ్యంగా ట్రోల్ కూడా చేస్తున్నట్లు ఆమె జబర్దస్త్ షోలో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన తమ్ముడు ఆ కామెంట్స్ చూపిస్తూ ఏంటక్కా ఇవన్నీ అనే సరికి తన మొహం చూపించలేకపోయినట్లు ఆమె ఆవేదన చెందింది.
ఆ సమయంలోనే జబర్దస్త్ కమెడియన్లు, రష్మి, రోజా ఇచ్చిన ధైర్యంతో తాను ముందుకు సాగుతున్నట్లు ఆమె చెప్పింది. ఇక నుంచి కూడా ఇక్కడ నుంచే పోరాడుతానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఆమెపై ట్రోలింగ్ చేసేవాళ్లకు.. నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్లకు ఆమె షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు విచ్చలవిడి కామెంట్లతో రెచ్చిపోయే వారికి తనదైన స్టయిల్‌లో ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట తన పాపులారిటీని పెంచుకుంటున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లకు కామెంట్లు చేసే ఆప్షన్ తీసేసింది. దీంతో ఎవరు కామెంట్ చేయడానికి లేకుండా చేసింది. ఆమెపై వచ్చే కామెంట్లకు ఇలా చెక్ పెట్టింది వర్ష. నన్ను కాదు.. నాలోని ఆర్ట్ ను చూడండి అంటూ నెటిజన్లకు రిక్వెస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆమెను సపోర్ట్ చేస్తూ.. లవ్ ఎమోజీలు, కామెంట్లు చేస్తూ సపోర్టు చేశారు.
































