YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో ఘోర పరాజయం అందుకున్నారు. 2019 ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించినటువంటి జగన్ ఈ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కాక కూటమి 164 స్థానాలలో విజయం సాధించింది.

ఇలా కూటమి ఈ స్థాయిలో గెలుపు అందుకోవటం ఊహాతీతం అని చెప్పాలి అయితే 1501 స్థానాలలో గెలుపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోవడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి అభిమానులు కంగుతిన్నారు. ఇలా ఎన్నికల ఫలితాలు రావడానికి గల కారణం ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలలో ఇలాంటి ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ఆయన తీసుకున్నటువంటి ఒకే ఒక కీలక నిర్ణయమని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్ స్కాంలో భాగంగా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. సుమారు 53 రోజులపాటు జైలు జీవితం గడిపినటువంటి చంద్రబాబు అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు..
చంద్రబాబు అరెస్ట్..
ఇలా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వ్యవహర శైలి పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. ఈ ఒక్క నిర్ణయమే జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలలో భారీ దెబ్బ కొట్టిందని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవటం నిజంగా వైసిపి అభిమానులు జీర్ణించుకోలేని విషయమని చెప్పాలి.





























