ఏపీ హోంగార్డులకు జగన్ సర్కార్ శుభవార్త.. 30 లక్షల బీమా?

0
211

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో హోంగార్డులుగా పని చేసే వారికి వరుస శుభవార్తలు చెప్పింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులుగా పని చేసే ఉద్యోగులలో అర్హులైన వారందరికీ ఇళ్లను కేటాయిస్తోందని అన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా రాష్ట్రప్రభుత్వం హోంగార్డులకు ఆరోగ్య ప్రయోజనాలను కల్పించే దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు.

రాష్ట్ర హోంగార్డుల 58వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 12,005 మంది అర్హులైన హోంగార్డులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు అయ్యాయని.. అర్హులైన మిగిలిన హోంగార్డులకు కూడా త్వరలో కార్డులు మంజూరు అవుతాయని వెల్లడించారు. ఈహెచ్‌ఎస్‌/ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి హోంగార్డుకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తున్నామని వెల్లడించారు.

మహిళా హోంగార్డులకు 90 రోజుల పాటు ప్రసూతి సెలవులను మంజూరు చేస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. సమాజానికి హోంగార్డులు విశేష సేవలను అందిస్తున్నారని డీజీపీ వెల్లడించారు. హోంగార్డులకు ఆకస్మిక మరణం సంభవిస్తే 30 లక్షల రూపాయల బీమా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. హోంగార్డులకు వేతనాలు భారీగా పెంచామని 21,300 రూపాయలు వేతనం చెల్లిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని హోంగార్డుల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో వేతనాల పెంపు, ప్రమాద బీమా వర్తింపు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 2021 సంవత్సరం జనవరి నుంచి హోంగార్డులు ఆకస్మిక మరణం పొందితే బీమా చెల్లిస్తామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here