Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జగపతిబాబు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం వరుసగా విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జగపతిబాబు మహేష్ బాబుకి మధ్య పెద్దగా సన్నివేశాలు హైలైట్ కాలేదని చెప్పాలి. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కానీ గుంటూరు కారం సినిమాలో వీరిద్దరి మధ్య సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు జగపతిబాబు తన పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ సినిమాలో మాత్రం అంతగా లేదని చెప్పాలి అయితే ఈ విషయం గురించి ఇటీవల జగపతిబాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు మహేష్ బాబుతో ఎప్పుడు పని చేయాలనే కోరిక ఉంటుందని జగపతిబాబు తెలిపారు.
మహేష్ తో పని చేయాలని కోరుకుంటా..
నిజాయితీగా మాట్లాడుకుంటే.. గుంటూరు కారం సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని, తనకు మహేష్ బాబుకి మధ్య ఉన్న సీన్లను ఎంజాయ్ చేయలేకపోయానని, మహేష్ బాబు లాంటి వాడితో చేస్తే మంచి పాత్రనే చేయాలన్నట్టుగా వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అన్నట్టుగా ఈ సినిమా చేశాను అంటూ ఈ సందర్భంగా జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



























