Sukesh Chandrashekhar: కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తు కారణంగా ఎలాంటి భయాందోళన పరిస్థితులు తలెత్తయో మనకు తెలిసినదే. కొండ చరియలు విరిగిపడటంతో రాత్రికి రాత్రి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు బ్రతికిన వారు సర్వం కోల్పోయి బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇలా కేరళలో జరిగిన ఈ ఘటన చూసిన ఎంతోమంది సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళం ప్రకటించారు అయితే తాజాగా జైలులో ఉన్నటువంటి వారు కూడా కేరళను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అయిన జాక్వెలిన్ ప్రియుడు సుఖేష్ చంద్రశేఖరన్ ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో భాగంగా జైలులో ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈయన తన లాయర్ ద్వారా కేరళ సీఎంకు లేక రాశారు. వయనాడ్ పరిస్థితి చూసి తనకు ఎంతో బాధ కలిగిందని అందుకే తాను 15 కోట్ల రూపాయల విరాళం ప్రకటించబోతున్నానని వెల్లడించారు అంతేకాకుండా అక్కడ సర్వం కోల్పోయిన వారికి 300 ఇండ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈయన తన లాయర్ ద్వారా కేరళ సీఎంకు లేక రాశారు.
చట్టబద్ధమైన ఖాతా నుంచి బదలీ…
ఇలా తాను సహాయం చేయడానికి ఒప్పుకుంటే ఈ విరాళం మొత్తం తన చట్టబద్ధమైన ఖాతా నుంచే పంపిస్తానని సుకేష్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ఈ విధంగా కేరళ బాధితుల కోసం ఈయన ఇంత మొత్తంలో సహాయం చేయడంతో పలువురు ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈయన సహాయం చేస్తానని ముందుకు రావడంతో ఈయన సహాయ సహకారాలను కేరళ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



























