Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో జనసేన పార్టీ కార్యకలాపాలన్నింటిని చూసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో ఈయన పోటీ చేయకపోయినా ఎన్నికలలో విజయం సాధించడానికి ఎంతగానో దోహదం చేశారు. ఇక ఎన్నికలలో కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది అలాగే జనసేన పార్టీ 23 స్థానాలలో పోటీ చేయగా అన్నిచోట్ల భారీ విజయం అందుకుంది.

ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఏకంగా 70000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో జనసేన నాయకులు మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
నాగబాబు సోషల్ మీడియా వేదికగా మీసం తిప్పుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈయన ఈ మీసం తిప్పినది జనసేన 100% స్ట్రైక్ రేట్ తో గెలిచారని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కూడా కాదు. ఈ ధర్మ పోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఒక్క ఆంధ్రుడి తరపున తను గర్వంతో తిప్పుతున్నానని పోస్ట్ చేశారు.
హామీలను నెరవేర్చండి..
ఈ విధంగా నాగబాబు మీసం తిప్పుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఇలాంటి ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీరు ఆంధ్రనా లేక తెలంగాణనా మీ ఓటు ఎక్కడుంది అంటూ కొందరు ప్రశ్నించగా మరి కొందరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినప్పుడే మీసం తిప్పండి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.





























