Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ తన సినిమా పనులకు కాస్త విరామం ఇచ్చి ఏపీ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసే ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం ఎలాగైనా గెలుపే లక్ష్యంగా ఈయన పిఠాపురం నుంచి పోటీకి దిగారు.

ఇక పిఠాపురంలోనే ఉంటూ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈయన పిఠాపురంలో ఒక ఇంటిని కూడా నిర్మించబోతున్నారని తెలుస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంటి నిర్మాణం చేపట్టే వరకు అక్కడే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు ఇటీవలే ఈ ఇంటి గృహప్రవేశం కూడా జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఉగాది పండుగను కూడా ఈ ఇంట్లోనే జరుపుకోబోతున్నారని తెలుస్తుంది.
నాలుగు అంతస్తుల స్థలంలో ఉన్నటువంటి ఈ ఇంటిని పవన్ కళ్యాణ్ అద్దెకు తీసుకొని తాను ఉండడమే కాకుండా పార్టీ కార్యకలాపాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ అద్దెకు తీసుకున్న ఇల్లు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఇంటిని తీసుకున్నారని తెలుస్తుంది. చేబ్రోలు బైపాస్ పరిధిలో ఓతూరి నాగేశ్వరరావు అనే రైతు నాలుగు అంతస్తుల ఇంటి నిర్మాణం చేపట్టారు అయితే ఈ ఇల్లు పవన్ అద్దెకు తీసుకున్నారని తెలియగానే ఈ ఇంటి అద్దె ఎంత అనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.
రూపాయి అద్దె..
ఇక ఈ ఇల్లు నిర్మించినటువంటి రైతు నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ ఉండటానికి తన ఇంటికి ఏ విధమైనటువంటి అద్దే అవసరం లేదని తెలిపారు. అయితే ఒక్క రూపాయి మాత్రమే తనుకు చెల్లిస్తే చాలు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి రైతు తన ఇంటిని అద్దెకు ఇచ్చారు ప్రస్తుతం ఈ ఇల్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి అనుగుణంగా మారుస్తూ ఉన్నారు.































