Jayamalini : డెబ్భైయ్యో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతిలక్ష్మి, జయమాలిని. అప్పట్లో వీరిద్దరు ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయినా వీరి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. మొదటి నుండి సినిమ నేపథ్యం ఉండటం వల్ల జ్యోతి లక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలాచార్య గారు జయమాలనిని చూసి ఆయన తెలుగులో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని గారు ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో బాలకృష్ణ కు హీరోయిన్ గా చేసారు. ఇక ‘జగన్మోహని’ సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఇలా అందరూ అగ్రహీరోల సరసన స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.

కృష్ణ గారు మరణించినపుడు ఏడ్చేసా…
ఎన్నో సినిమాల్లో దాదాపు అందరు హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసిన జయమాలిని గారు వారందరి గురించి అలానే తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చి సినిమా వాళ్ళను కలిసిన ఆమె చిరు, బాలకృష్ణ వంటి హీరోలను కలిసి మాట్లాడారు. అయితే కృష్ణ, కృష్ణం రాజు, కైకాల వంటి వారు మరణించడం చాలా బాధించిందని వారిని కూడా చూస్తానని అనుకున్నాను అంటూ తెలిపారు.

ఇక కృష్ణ గారు మరణించిన రోజు టీవిలో ఆ వార్త వినగానే ఏడుపు వచ్చిందంటూ తెలిపారు. విజయ నిర్మల గారి డైరెక్షన్లో చాలా సినిమాల్లో నటించానని ఆమె అన్నా, కృష్ణ గారన్నా చాలా గౌరవం అంటూ తెలిపారు. విజయ నిర్మల గారు మరణించినపుడు కృష్ణ గారిని చూస్తే బాధేసింది. విజయ నిర్మల గారు మరణించాక కృష్ణ గారు చాలా బలహీనపడిపోయారు. అపుడే ఆయన సగం ప్రాణం పోయినట్లు అయిపోయారు అంటూ కృష్ణ విజయ నిర్మల గారి గురించి జయమాలిని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.






























