ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ లో హీరోలకు ఎంత క్రేజ్ ఉండేదో హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉండేది. అప్పుడు వచ్చిన సినిమాల్లో హీరో పాత్రకు ధీటుగా హీరోయిన్ పాత్రలు ఉండేవి ఉదాహరణకి సినిమాలో హీరో పోలీస్ అయితే హీరోయిన్ లాయర్ అయ్యుండేది అలాంటి ఇంపార్టెంట్ రోల్ లో హీరోయిన్స్ నటిస్తూ ఉండేవారు. అప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించిన వారిలో సావిత్రి గారు, జమున,వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటివారు ఉన్నారు. వీళ్ళందరూ టాప్ హీరోయిన్స్ అయినప్పటికీ అందులో జయసుధ గారు అందరి హీరోల పక్కన నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

జయసుధ గారికి మగాళ్ళలో ఆడవాళ్ళలో చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఒక మంచి ఇంపార్టెంట్ పాత్రలో నటించి తనదైన గుర్తింపును సాధించింది. అయితే ఇండస్ట్రీ హీరోగా ఉన్న వడ్డే నవీన్ జయసుధ గారి కొడుకు అని రూమర్లు బాగానే వచ్చాయి. కానీ వడ్డీ నవీన్ వాళ్ళ నాన్న అయిన వడ్డె రమేష్ వాళ్ల బామ్మర్ది అయిన రాజేంద్ర ప్రసాద్ గారిని జయసుధ పెళ్లి చేసుకున్నారు అంటే ఈ లెక్కన వడ్డె రమేష్ గారికి ఆవిడ చెల్లెలు అవుతుంది.

అయితే రాజేంద్రప్రసాద్ ఒక బిజినెస్ మ్యాన్ జయసుధ రాజేంద్రప్రసాద్ లవ్ చేసుకున్నారు ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్తే వాళ్లు కాదనడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చేసేదేంలేక ఇంట్లో వాళ్ళు పిలిచి రిసెప్షన్ పెట్టారు. అయితే ఈ పార్టీకి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు వచ్చారు వారిలో దాసరి నారాయణరావు గారు మురళి మోహన్ గారు లాంటి వారు వచ్చారు. చాలామంది జయసుధ గారి ఫ్యాన్స్ కూడా ఈ పెళ్లిని చూడ్డానికి వచ్చారు పెళ్ళయిన కొన్ని రోజులకే జయసుధ మళ్లీ సినిమాల్లో నటించింది. రాజేంద్రప్రసాద్ తన బిజినెస్ లు తను చూసుకుంటూ ఉండేవాడు అలాగే రోజు జయసుధ ని టార్చర్ పెట్టేవాడట దీంతో విసిగిపోయిన జయసుధ విజయవాడ నుంచి చెన్నై వెళ్లి విజయ వాహిని స్టూడియో అధినేత అయిన నాగిరెడ్డి గారిని కలిసి జరిగిన విషయం అంతా చెప్పింది.

దీంతో నాగిరెడ్డి ఇండస్ట్రీలో ప్రముఖులైన దాసరి నారాయణరావు లాంటి వారిని పిలిచి అందరి ముందు రాజేంద్ర ప్రసాద్ తో మాట్లాడితే తను చాలా అమాయకంగా ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు దాంతో జయసుధ నాకు నువ్వు అవసరంలేదు అని చెప్పేసి ఇద్దరు విడిపోయారు చాలా రోజుల పాటు జయసుధ విజయ వాహినీ స్టూడియో లోనే ఉంది దాని తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అలా సినిమాలు చేస్తున్న సమయంలో నితిన్ కపూర్ తో పరిచయం ఏర్పడడం వలన ఆయన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా చాలా సినిమాల్లో నటిస్తూ హీరోలకి తల్లి పాత్రలు చేస్తూ వచ్చారు.

అలా ఆవిడ చేసిన పాత్రల్లో రవితేజ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె హీరోలకు తల్లి పాత్రలు చేశారు. ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ లో భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా లో సిద్ధార్థ తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో మొదటి పెళ్లి చేసుకొని వాళ్ల భర్తలు మంచివారు కాకపోవడంతో విడాకులు తీసుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కానీ జయసుధ గారు లవ్ చేసి పెళ్లి చేసుకున్న తన భర్త అయిన రాజేంద్ర ప్రసాద్ అలా టార్చర్ పెట్టి తనను విసిగించడం వేధించడం చేయడం అనేది సరైనది కాదు కాబట్టి జయసుధ గారు అతన్ని వదిలించుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు అని రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలిసిన చాలా మంది అంటుంటారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here