Jayasudha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని సీనియర్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ శోభన్ బాబు కృష్ణంరాజు వంటి హీరోల సరసన నటించి మెప్పించినటువంటి వారిలో నటి జయసుధ ఒకరు ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ బామ్మ పాత్రలలో నటిస్తూ ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జయసుధ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఆస్తులను కోల్పోవడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆస్తులను సంపాదించడానికి కూడా అదృష్టం ఉండాలని ఈమె తెలియజేశారు. తాను హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో చెన్నైలోని ఒక ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసే బిల్డింగ్ కట్టానని తెలిపారు.
ఇలా బిల్డింగు కట్టడంతో శోభన్ బాబు గారు చాలా మంచి పని చేశారు అంటూ నన్ను మెచ్చుకున్నారు అయితే ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అక్కడ స్లంప్ రావడంతో రెంట్ కు కూడా ఎవరూ రాలేదు దీంతో ఆ బిల్డింగ్ అమ్మేశాను కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ బిజీ ఏరియాగా మారిపోయిందని ఇప్పుడు దాని విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉందని తెలిపారు.
ఆ పొరపాట్లే కారణం..
ఇక చెన్నైలో తాను 9 ఎకరాల పొలం కొన్నాను. అందులో బోర్ పడకపోవడంతో తాను ఆ పొలం ఇక ఉన్న వేస్ట్ అని తాను అమ్మేశానని తెలిపారు. అయితే ఆ పొలం ఇప్పుడు వందల కోట్ల విలువ చేస్తుంది అంటూ జయసుధ ఈ సందర్భంగా తాను చేసిన చిన్న చిన్న పొరపాట్లు కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులను కోల్పోయాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.




























