Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఈయన పలు రాజకీయ అంశాల గురించి మాట్లాడటమే కాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారులతో ఉన్నత సమీక్షలు నిర్వహించడమే కాకుండా పలు కీలక ఆదేశాలను కూడా జారీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉండబోతుందనే విషయం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు ఆయన చేసే చేష్టలకు పోలిక ఉండదు. ఇలాంటి తరుణంలోనే దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకు తాను పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు నేరుగా కలవలేదని తెలిపారు. ఈయన ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకుంటున్నారు. మరొక నెలరోజుల తర్వాత ఆయన పరిపాలన విధానం పై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు.
కులమే సపోర్ట్ చేసింది..
నా అంచనా ప్రకారం ఈయన రాజకీయాలలో ఎక్కువ కాలం పాటు ఉండరని తెలిపారు. ఎందుకంటే ఆర్థికంగా చూసుకుంటే రాజకీయాలలో కంటే సినిమాలలోనే బెటర్ అని తెలియజేశారు. కుల రాజకీయాలపై స్పందించిన దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు బేస్ కులమే అని కులమే పవన్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసిందని వెల్లడించారు.





























