JC Prabhakar Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో రోడ్డు రవాణా శాఖ అధికారులకు తనదైన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు రవాణా శాఖ అధికారులు జెసి ట్రావెల్స్ పై అటాక్ చేసారు.

జెసీ ట్రావెల్స్ మూతపడటానికి ప్రధాన కారణమయ్యారు. ఈ విషయం గురించి జెసి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల పాలనలో రవాణా శాఖ అధికారులు మా ట్రావెల్స్ ను చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు. అరెస్టులు చేసి జైలుకు పంపించారు మీకు భార్యాబిడ్డలు ఉన్నారు కదా అంటూ ఈయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
గత పాలనలో మా పిల్లలను ఎంత హింసించారో నేను మర్చిపోలేదు. నేను సీఎం చంద్రబాబు నాయుడుని ఏమీ అనటం లేదు అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరినీ కూడా అడ్డంగా నరుకుతానంటూ ఈయన వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని,అధికారులు సీతారామాంజనేయులు, ప్రసాదరావు, డీటీసీ, వర్క్ ఇన్స్పెక్టర్లను ఎవరినీ వదలను అంటూ ఈయన తెలిపారు.
జెసీ ట్రావెల్స్..
మీరంతా ప్రభుత్వ ఉద్యోగులే కదా మీ వల్ల నేను నా భార్య బిడ్డలు బయట తిరగలేక పోయాము. అందరిని నరుకుతా నేను తప్పుగానే మాట్లాడి ఉండవచ్చు.. మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు నా బస్సులను రిపేర్ చేసి పెట్టాల్సిందే అంటూ ఈయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి పేర్ని నాని పట్ల అసభ్యకర పదజాలంతో మాట్లాడుతూ రెచ్చిపోయారు.





























