JD Chakravarthy: నా భార్య విషం పెట్టిందనే వార్తలలో నిజం లేదు… క్లారిటీ ఇచ్చిన జెడి చక్రవర్తి!

0
66

JD Chakravarthy: జెడి చక్రవర్తి పరిచయం అవసరం లేని పేరు నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి జెడి చక్రవర్తి ప్రస్తుతం దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు జెడి చక్రవర్తి హాజరవుతున్నారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తను అనుకున్న వాళ్లు నన్ను భారీగా మోసం చేశారని తెలిపారు. నాపై విష ప్రయోగం కూడా చేశారని తెలిపారు.

8 నెలలుగా నాపై విష ప్రయోగం చేస్తూ తనకు స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తన స్నేహితుడికి తెలిసినటువంటి డాక్టర్ నాగార్జున కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నానని ఈయన తెలిపారు.అయినవాళ్లే సొంతవాళ్లే అని చెప్పడంతో తన భార్య తనపై విష ప్రయోగం చేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

JD Chakravarthy: అయిన వాళ్ళే విష ప్రయోగం చేశారు…


కొందరు జేడి చక్రవర్తి పై తన భార్య విష ప్రయోగం చేసిందనే థంబ్నెల్స్ కూడా పెట్టారు. అయితే నా భార్య గురించి ఇలా వస్తున్నటువంటి ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలియజేశారు. అయినవాళ్లు నాకు విషం పెట్టారని చెప్పాను కానీ ఎక్కడ నా భార్య అని తాను చెప్పలేదని అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదంటూ జేడీ చక్రవర్తి ఈ సందర్భంగా తన భార్య గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.