Featured
తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన జెస్సీ.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు వైరల్..!
తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్ ఐదో సీజన్ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు నిన్న గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది
Published
3 years agoon
By
lakshanaతెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్ ఐదో సీజన్ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు నిన్న గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుపెట్టగా.. మొదటి వీక్ లో సరయు ఎలిమినేట్ అయింది.
తర్వాత 8వ వారంలో హౌస్ లో పెద్ద టర్న్ తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ వారంలో మొత్తం 5గురు నామినేషన్లో ఉండగా.. అబదులో చివరకు మానస్, కాజల్ నిలిచారు. ఆ వారం అప్పటికే జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతూ ఇబ్బందులు పడుతుండగా.. అతడిని సీక్రెట్ రూంలో ఉంచారు నిర్వాహకులు.
అందులో అతడికి వైద్యులు ట్రీట్ మెంట్ ఇస్తూ వచ్చారు. కానీ అప్పటికీ అతడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దీంతో మానస్, కాజల్ సేఫ్ అయ్యారు. ఇక జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా షణ్ముఖ్, సిరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు.
ఇక ఫైనల్ అతడు నాగార్జునతో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడు. విజయవాడ వెళ్లిన దగ్గర నుంచి ఎక్కువగా తనతో సెల్ఫీలు దిగుతున్నారని చెపపాడు. అంతే కాకుండా అతడికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నట్లు చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పాడు.
బిగ్ బాస్ వల్ల తన లైఫ్ టర్న్ అయిందని చెప్పడు. ఇక తాజాగా ఈ విషయాన్ని స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన ఫస్ట్ మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.సందీప్ మైత్రేయ దర్శకత్వంలో ఓ డెబ్యూ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు.
You may like
Flash Back : ఒకే సంవత్సరంలో ఈ ముగ్గిరి హీరోల చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్.. కానీ వెంకటేష్ మాత్రం అలా ఉండిపోవాల్సివచ్చింది.!!
Babu Antony : పసివాడి ప్రాణం సినిమాలో ఒకప్పటి విలన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
Nayanatara: నయనతారకు సంతానయోగం లేదు.. అవన్నీ డ్రామాలే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!
Rashmika: రష్మిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…. ఇప్పుడు భారీగానే అందుకుంటుందిగా?
Vijay Devarakonda: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ… ఎన్ని లక్షలకు అమ్మారో తెలుసా?
Mrunal Thakur: మెంటల్ నా ** అంటే అర్థం తెలుసా… రిపోర్టర్ ప్రశ్నకు మృణాల్ షాకింగ్ ఆన్సర్!
Featured
Tollywood: పవన్, రాజమౌళి కాంబోలో మూవీ.. అడ్డంగా ఇరికించేసిన జక్కన్న!
Published
9 hours agoon
8 October 2024By
lakshanaTollywood: టాలీవుడ్ హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే మరొకవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇటీవలె సినిమాలకు సంబంధించిన షూటింగ్ ని కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే మరోవైపు రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో వీరిద్దరికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే.. పవన్ కళ్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అది ఊహకు కూడా అందదు.
ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు టాలీవుడ్ లోనే అంత్యంత క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గా ఇది నిలుస్తుందని చెప్పవచ్చు. కాగా జక్కన్న ఇప్పటి వరకు ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు, ప్రభాస్ తో మూడు సినిమాలు, రామ్ చరణ్‌తో రెండు సినిమాలు, నితిన్, రవితేజ, నాని, సునీల్ లతో ఒక్కో సినిమా చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో మొదటిసారి సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ఆయన ఈ మూవీని రూపొందించబోతున్నారు.
పాన్ ఇండియా ఆర్టిస్టులతో పాటు అంతర్జాతీయంగా పేరున్న ఆర్టిస్ట్ లను కూడా దించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించిన ప్రస్తావన ఉండటం విశేషం. పవన్ తో సినిమా చేయాలని ఫ్యాన్స్ అరుస్తుండగా, పవన్ కళ్యాణ్ ని అడగాలని రాజమౌళి చెప్పడం, జక్కన్నతో సినిమా చేయడానికి సంబంధించిన పవన్ కూడా రియాక్ట్ కావడం విశేషం. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్‌కి గెస్ట్ గా రాజమౌళి వచ్చారు.
సమాధానం ఆయనే చెప్పాలి..
పంజా సినిమా టైటిల్ అదిరిపోయిందని, టైటిల్ సాంగ్ కూడా చించేశారు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ ని కలుద్దామని చాలా సార్లు అనుకున్నాను. కానీ ఎప్పుడూ కుదరలేదు. ఒకసారి కోల్‌కత్తా లో షూటింగ్‌లో ఉన్నారని వెళితే, నేను వెళ్లిన రోజే ఆయనకు షూటింగ్ లేదు. అలా మిస్ అయ్యింది. ఇన్నాళ్లకి పంజా ఈవెంట్‌లో కలిసే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంద ని అన్నారు రాజమౌళి. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఫ్యాన్స్ పవన్‌తో సినిమా అని అరుస్తున్నారు. దీనికి రాజమౌళి రియాక్ట్ అవుతూ ఆ ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పాలి అంటూ వెళ్లిపోయారు రాజమౌళి. అలా అభిమానుల ముందు పవన్ కళ్యాణ్ ని అడ్డంగా ఇరికించేశారు జక్కన్న.
Featured
Nagarjuna: కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోండి: నాగార్జున
Published
9 hours agoon
8 October 2024By
lakshanaNagarjuna: గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య పేరు అలాగే కొండా సురేఖ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పట్ల సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. నాగార్జున కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కొండా సురేఖ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.
నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నాగార్జునకు తెలిపింది. దీంతో ఆయన తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని నాగార్జునను న్యాయ స్థానం ప్రశ్నించింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు.
ఆ ఉద్దేశంతోనే..
రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అన్ని టెలివిజన్ ఛానళ్లు, పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని నాగ్ తెలిపారు. అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. మరి ఈ విషయంపై కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తుందో కోర్టు ఆమె పట్ల ఏ ఏమైనా తీర్పును ఇస్తుందో చూడాలి మరి. అలాగే పరువు నష్ట దావా కింద కోటి రూపాయల వరకు నాగార్జున కోర్టులో వేసినట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి. ఇప్పటికే నాగార్జునకు ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్, నాని, కుష్బూ, ఇంకా చాలామంది సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
Featured
Kavya Thapar: నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్న హీరోయిన్.. అందుకోసమేనా!
Published
9 hours agoon
8 October 2024By
lakshanaKavya Thapar: తెలుగు ప్రేక్షకులకు ముంబై బ్యూటీ కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. తన అందంతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇక అదే ఊపుతో ఏక్ మినీ కథ, ఈగల్,ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.
టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య థాపర్. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. అయితే మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య మాట్లాడుతూ.. నేను మన కల్చర్స్ ఫాలో అవుతాను. నవరాత్రికి మన సంసృతిలో ఏం చేస్తారో అవన్నీ చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను.
మొదటిసారి ఉపవాసం..
మొదటి సారి నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటున్నాను విశ్వం సినిమాకు మంచి విజయం రావాలని, కేవలం సాత్వికాహారం లాంటిది మాత్రమే తీసుకుంటున్నాను అని తెలిపింది. దీంతో ఇంటర్వ్యూలో ఉన్న గోపీచంద్, శ్రీను వైట్ల సైతం ఆశ్చర్యపోయారు. తన సినిమా హిట్ అవ్వాలని ఉపవాసం ఉంటున్న ఈ ముద్దుగుమ్మని ప్రేక్షకులు సైతం అభినందిస్తున్నారు. కావ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తప్పకుండా ఆ సినిమా విజయం సాధిస్తుంది దుర్గమ్మ అమ్మవారికు అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఆమె డెడికేషన్ కు మెచ్చుకుంటున్నారు. సినిమా కోసం మీరు ఉపవాసం ఉంటున్నారు తప్పకుండా ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా కావ్య చేతిలో ఈ సినిమాతో పాటు మరొక మూడు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.
Tollywood: పవన్, రాజమౌళి కాంబోలో మూవీ.. అడ్డంగా ఇరికించేసిన జక్కన్న!
Nagarjuna: కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోండి: నాగార్జున
Kavya Thapar: నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్న హీరోయిన్.. అందుకోసమేనా!
Nidhhi Agerwal: రాజాసాబ్ నుంచి అలాంటి ఫోటో షేర్ చేసిన నిధి అగర్వాల్.. ఫోటో వైరల్!
Tollywood: చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటుడు.. ఎవరో తెలుసా?
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
Trending
- Featured4 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
- Featured2 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured4 weeks ago
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
- Featured4 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
- Featured4 weeks ago
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
- Featured4 weeks ago
Actress Rohini: కమిటీ సిద్ధం చేసాము…వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడొద్దు: రోహిణి
- Featured1 week ago
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
- Featured1 week ago
Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా