Air Taxi Service: ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి అంటే ఇక విమాన ఇంధన ధరలు లక్షలకు చేరువగా ఉన్నాయి. ఇలా విమాన ఇంధన ధరలు కూడా అమాంతం పెరిగి పోవడంతో విమానయాన ఛార్జీలు కూడా పెరగడంలో ఎలాంటి సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

ఇకపై విమాన ప్రయాణాలు కూడా ఎంతో భారంగా మారనున్నాయి. ఇలా విమాన చార్జీలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రికెటర్ యువరాజ్ సింగ్, పారశ్రామికవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ జెట్ విమాన సేవల సంస్థ అయిన జెట్ సెట్ గో.. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ – ఆఫ్ అండ్ ల్యాండింగ్ సరికొత్త ఆలోచన చేసింది.

ప్రస్తుతం నగరాలలో అధిక ట్రాఫిక్ కారణంగా ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లాలంటే ఎంతో ప్రయాసలతో కూడుకున్నది అధిక సమయం వృథా కావడమే కాకుండా అధిక డబ్బులు కూడా ఖర్చవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాలను గుర్తు పెట్టుకున్న జెట్ సెట్ గో కేవలం కిలోమీటర్ కి 12 రూపాయల చొప్పున విమానయాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేసింది.
అందుబాటులోకి ఈవీటోల్స్ సేవలు…
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నగరాలలో ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లాలంటే అధికంగా సమయం డబ్బులు వృధా అవుతున్న నేపథ్యంలో పైలట్ ఉండని భారీ డ్రోన్లలో నలుగురు వ్యక్తులు ప్రయాణించే విధంగా ఈ వీటోల్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కసారి చార్జింగ్ తో ఈవీటోల్స్ 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు ఇలా కిలో మీటర్ కు 12 రూపాయల చొప్పున ప్రయాణికులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించి అనంతరం ముంబై బెంగుళూరు వంటి ప్రాంతాలలో కూడా ఈ సేవలను విస్తరింప చేయనున్నారు.



























