Jinna: మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం జిన్నా. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాప్ సొంతం చేసుకోవడమే కాకుండా దారుణమైన కలెక్షన్లను రాబట్టింది. మొదటిరోజు కనీసం 10 లక్షల షేర్స్ కూడా రాబట్ట లేకపోవడం గమనార్హం.ఇలా ఈ సినిమా అన్ని ఏరియాలలోను దారుణమైన కలెక్షన్లను సొంతం చేసుకుందనే వార్తలు వస్తున్నప్పటికీ మంచు అభిమానులు మాత్రం సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా విజయవాడకు చెందిన ఒక యువతి జిన్నా విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ యువతి విజయవాడ పివిపిలో జిన్నా సినిమాను మొదటి రోజు చూసేందుకు టికెట్ బుక్ చేసుకుని వెళ్లారట ఇక షో వెయ్యడానికి సర్వం సిద్ధం చేసినప్పటికీ థియేటర్లో మాత్రం ఇద్దరే ప్రేక్షకులు ఉన్నారు.షో కి సంబంధించిన యాడ్స్ అన్ని కూడా వేసిన ప్రేక్షకులు ఎవరు రాకపోవడంతో థియేటర్ యాజమాన్యులు షో రద్దు చేసినట్లు తెలిపారు.
ఇలా జిన్నా సినిమా షో రద్దు చేయడమే కాకుండా పక్క స్క్రీన్ పై ప్రదర్శితం అవుతున్న ఓరి దేవుడా సినిమా చూడాలని లేకపోతే తన టికెట్ డబ్బులు తనకు వాపస్ ఇస్తామని థియేటర్ నిర్వాహకులు తెలియజేశారట. ఈ విధంగా ఈ యువతి జిన్నా సినిమా విషయంలో తనకు జరిగిన ఘటనను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే కేవలం విజయవాడలో మాత్రమే కాకుండా పలు ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తుంది.

Jinna: మంచు విష్ణు కెరియర్ లోనే దారుణమైన కలెక్షన్స్..
ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో మంచో హీరోలకు సినిమాలు పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది.మంచు విష్ణు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే జిన్నా సినిమా మాత్రం దారుణమైన కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయంపై మంచి ఫ్యామిలీ ఇప్పటివరకు ఏ మాత్రం స్పందించలేదు.






























