Bollywood Comedian Johnny Lever : ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం కంటే శ్రమని నమ్ముకున్న వ్యక్తులు ఖచ్చితంగా పైకి వస్తారని చెప్పడానికి మంచి ఉదాహరణ బాలీవుడ్ అగ్ర కమెడియన్ జానీ లివర్. ఆయన దాదాపు 300 కీ పైగా సినిమాల్లో నటించి కోట్ల ఆస్తులను సంపాదించిన కమెడియన్. అయితే ఒకప్పుడు రోజు పూట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబం నుండి వచ్చి ప్రస్తుతం కోట్ల ఆస్తులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఆయన మన తెలుగువారే కావడం విశేషం.

ప్రకాశం జిల్లా కనిగిరికీ చెందిన జానీ లివర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల. ఈయన తండ్రి హిందూస్తాన్ లివర్ కంపెనీ లో ఉద్యోగిగా ఉండటం వల్ల ముంబైలో పెరిగారు. అయితే తండ్రి మధ్యానికి బానిసై కుటుంబ బాధ్యతలు మరవడంతో పెద్ద కొడుకుగా జానీ లివర్ గారే బాధ్యతలను తీసుకున్నారు. స్కూల్ కీ వెళుతూనే మరోవైపు స్కూల్ బయట పెన్నులను అమ్మేవాడట. అయితే కొద్ది రోజులకు సరిగా అమ్ముడు పోకపోవడంతో డబ్బులు లేక స్కూల్ మానేసి ఫుల్ టైం పెన్నులను అమ్మడానికి ముంబై రోడ్లలో తిరిగేవాడట. అంతే కాక తండ్రి చిన్నవయసులోనే మధ్యం అలవాటు నేర్పించి కొంతవరకు పాడు చేసినా కుటుంబ బాధ్యతలు చెల్లెళ్ళ బాధ్యతలు అతడిని పూర్తిగా మార్చేశాయట. ఆత్మహత్య చేసుకోవాలని ఒకానొక సమయంలో అనుకున్నా.. చివరికి కుటుంబ బాధ్యతలు చనిపోనివ్వలేదని పలు ఇంటర్వ్యూ లలో జానీ లివర్ తెలిపారు.
ఇక ఆయన మిమిక్రి చేస్తూ నవ్వించగల టాలెంట్ ఉండటంతో స్టాండప్ కమెడియన్ గా మారి పలు స్టేజి షోస్ ఇవ్వడం స్టార్ చేయగా వాటి నుండి డబ్బు రావడమే కాక మంచి పేరు సంపాదంచారు. అలా బాలీవుడ్ డైరెక్టర్ సునీల్ దత్ తాను తీయబోతున్న ‘దర్ద్ కా రిస్తా’ సినిమాలో కమెడియన్ గా అవకాశం ఇచ్చారు. అలా సినిమా కెరీర్ మొదలు పెట్టి స్క్రీన్ నేమ్ జానీ లివర్ గా మార్చుకున్నారు. అలాగే బాజీఘర్ సినిమాతో మంచి సక్సెస్ చూసిన ఆయన బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. అలా 2000 సంవత్సరంలో ఏకంగా ఆయన ఉన్న బాలీవుడ్ సినిమాలు 21 వరకు విడుదల అయ్యాయి.
250 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిన ఆయన కుటుంబం విషయానికి వస్తే సుజాత అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూతురు జామీ కొడుకు జెస్సి కాగా కూతురు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మిమిక్రి ఆర్టిస్టుగా రానిస్తూనే సినిమాల్లోను చేసారు. తెలుగులో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో నరేష్ తమ్ముడి భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జామి. ఇక జానీ లివర్ గారి తమ్ముడు జిమ్మీ మూస్ కూడా కమెడియన్ గా రానిస్తున్నారు. ఇక బంధువులను కలవడం కోసం ఇప్పటికి ప్రకాశం జిల్లా కనిగిరికి వస్తుంటారు జానీ లివర్. ఆయన హిందీ, మరాఠి, ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా చక్కగా మాట్లాడగలరు.






























