Johnny Master:కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈయన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ ని కూడా అంతే అభిమానిస్తారు.ఈ క్రమంలోనే మెగా హీరోలు నటించే ప్రతి సినిమాకి ఈయన కొరియోగ్రఫీ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే జానీ మాస్టర్ మెగా కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఎన్నోసార్లు బయటపెట్టారు. అయితే తాజాగా కేవలం రామ్ చరణ్ వల్లే తన భార్య బిడ్డ బతికి ఉన్నారని రామ్ చరణ్ చేసిన సహాయం గురించి తెలియజేశారు.అయితే ఒక డాన్స్ షోలో భాగంగా జానీ మాస్టర్ జీవితంలో జరిగిన ఈ సంఘటనను కంటెస్టెంట్లు ఫర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఇందులో భాగంగా జానీ మాస్టర్ సతీమణి గర్భవతిగా ఉన్నప్పుడు వెంటనే తనకు సర్జరీ చేస్తేనే ఇద్దరు ప్రాణాలు నిలబడతాయని వెంటనే సర్జరీ చేయాలి లేదంటే ఎవరో ఒకరిని మాత్రమే కాపాడుతామని వైద్యులు చెప్పారు.
ఈ విధంగా డాక్టర్లు చెప్పేసరికి ఏం చేయాలో దిక్కు తెలియక సహాయం కోసం జానీ మాస్టర్ రామ్ చరణ్ గారికి ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో రాంచరణ్ మౌనవ్రతంలో ఉన్నారనీ తన మేనేజర్ చెప్పడమే కాకుండా తనకు ఏం చెప్పాలో చెప్పండి అంటూ మేనేజర్ అడిగారు. విషయం చెప్పినప్పటీకీ జానీ మాస్టర్ మాత్రం రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉంటే తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని భావించారు.

Johnny Master: బిల్లు మొత్తం ఉపాసన కట్టారు…
ఇక రాంచరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఆయన చేయాల్సిన సహాయం చేశారు. ఇక హాస్పిటల్ కి వెళ్ళగా వెంటనే సర్జరీ చేసి తన భార్య బిడ్డని ఇద్దరిని బ్రతికించారని అయితే ఫీజు కట్టే సమయంలో సిబ్బంది కేవలం 350 రూపాయలు మాత్రమే కట్టండి మిగిలినది మొత్తం ఉపాసన మేడం కట్టారని చెప్పారట. ఇది తెలిసి జానీ మాస్టర్ ఆశ్చర్యపోయారు. రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఆయన తనను సహాయం కోరి వచ్చే వారిని వెనుతిరిగి పంపించరని ఇలా ఏదో రూపంలో సహాయం చేస్తారంటూ జానీ మాస్టర్ కు రామ్ చరణ్ చేసిన సహాయాన్ని ఇలా పర్ఫామెన్స్ చేసి చూపించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుంది.
































