Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కూటమిలో భాగంగా 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనసేన ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ సెలబ్రిటీలు మొత్తం తరలి వస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు అందరూ కూడా పిఠాపురంలో పర్యటన చేయగా చిరంజీవి రామ్ చరణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు అయితే తాజాగా జనసేన నేతలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య భారీ షాక్ ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా ఈయన జనసేన పార్టీకి ఓటు వేయొద్దని తెలియజేశారు. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా తెగిస్తుందని తెలిపారు. ప్యాకేజీ కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతుంది. జనసేన సిద్ధంతాలను పవన్ కళ్యాణ్ కూడా పాటించరు. ఆయన మాటలకు చేష్టలకు ఏమాత్రం పొంతన ఉండదని తెలిపారు.
ఆర్టిస్టులను భయపెడుతున్నారు..
చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే మెగా ఫ్యామిలీ పని చేస్తుందని, ప్రచారాలకు రాకపోతే తమకు అవకాశాలు లేవని ఆర్టిస్టులను భయపెట్టి ప్రచార కార్యక్రమాలకు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇలా ఎంతోమంది జనసేనను నమ్మి మోసపోయారు అంటూ ఈ సందర్భంగా వెంకట చైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.





























