Josh Ravi: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం జనవరి 27వ తేదీ నిన్నొక్కటే చిత్ర పరిశ్రమ కోలుకోలేని విధంగా వరుస విషాద సంఘటనలతో ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న ఉదయం జమున గారి మరణం అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రావు మూర్తి మరణ వార్త ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసాయి. ఇలా వీరి మరణ వార్తల విషయం తెలిసిన వెంటనే యాంకర్ విష్ణు ప్రియ తల్లి మరణ వార్తను కూడా తెలిపారు.

ఇలా ఈ విషాద సంఘటనల నుంచి తేరుకోక ముందే నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురవడం అందరిని కలిసి వేసింది. ఇలా కేవలం నిన్న ఒక్కటే ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న జోష్ రవి కారు కూడా ప్రమాదానికి గురైంది.
అయితే అందరూ రచ్చ రవి కారు ప్రమాదానికి గురైందని తాను ప్రమాదంలో పడ్డారని వార్తలు సృష్టించారు. కానీ ఆ కారులో ఉన్నది రచ్చ రవి కాదని జోష్ రవి అని తెలుస్తుంది.జబర్దస్త్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన జోష్ రవి గుండెజారి గల్లంతయింది సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి జోష్ రవి కారు ప్రమాదానికి గురైంది.

Josh Ravi: స్వల్ప గాయాలతో బయటపడ్డ జోష్ రవి…
జోష్ రవి కారులో జనవరి 26వ తేదీ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఈయనకు చిన్నచిన్న గాయాలయ్యాయి. ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ఇలా జోష్ రవి కారు ప్రమాదానికి గురవడంతో చాలామంది రచ్చ రవి కారు ప్రమాదానికి గురైందని తాను ప్రమాదంలో పడ్డారని వార్తలను సృష్టించారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన రచ్చ రవి తాను క్షేమంగా ఉన్నానని తెలియజేశారు.































