Ntr: జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ బయటకు వస్తే ఆయన అభిమానులను కంట్రోల్ చేయడం చాలా కష్టతరంగా మారుతుందనే విషయం మనకు తెలిసిందే.

తన సినిమా ఈవెంట్లకు వెళ్లిన అభిమానులు బౌన్సర్ల కళ్ళు కప్పి మరి ఎన్టీఆర్ వద్దకు చేరుకుంటారు. ఇలా ఎన్నో సందర్భాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి అయితే తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఎన్టీఆర్ కి పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి ఈయన తిరిగి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా అభిమానులు ఆయనని చుట్టుముతారు.
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కారు వద్దకు వెళుతూ ఉండగా బౌన్సర్స్ అందరూ కూడా తనని సెక్యూర్ చేస్తూ వచ్చారు కానీ అభిమానులు పెద్ద ఎత్తున తోసుకొంటూ వచ్చారు. ఒక అభిమాని అయితే ఏకంగా బౌన్సర్స్ ని దాటుకొని ఎన్టీఆర్ కాళ్ళ మీద పడ్డారు దీంతో బౌన్సర్స్ తనని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఎన్టీఆర్ ఆ సమయంలో కింద పడబోవడంతో వెంటనే బాన్సర్స్ పట్టుకున్నారు.
అత్యుత్సాహం..
ఇలా అభిమానులు అంతలా తనని తోసుకొని వస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఏ మాత్రం ఓపిక నశించిపోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది అయితే అభిమానులు చూపించే అభిమానం కొన్నిసార్లు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి అనడానికి ఇదే నిదర్శనమని చెప్పాలి.



























