టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కి కార్లంటే ఎంతో ఇష్టం అన్న సంగతి మనకు తెలిసిందే. ఈక్రమంలోనే తనకి ఎంతో ఇష్టమైన లంబోర్ఘి ఊరుస్ కారును ఇటలీ నుంచి ఐదుకోట్లు ఖర్చుచేసి తెప్పించుకున్నారు. అయితే ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న కార్లలన్నింటికీ ఒకటే ఫ్యాన్సీ నెంబర్. తాజాగా ఈ కారు నెంబర్ కోసం ఎన్టీఆర్ ఎంతో డబ్బు ఖర్చుచేసి తన ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ కు 9999 అనే నెంబర్ అంటే ఎంతో సెంటిమెంట్ అన్న విషయం మనకు తెలిసిందే. గతంలో తన తాత నందమూరి తారక రామారావు,తన తండ్రి హరికృష్ణ కూడా ఇదే నెంబర్ ఉన్న కార్లను వాడటం వల్ల ఆ సెంటిమెంట్ గా ఎన్టీఆర్ కూడా ఇదే కారు నెంబర్ ను ఉపయోగిస్తున్నారు. ఈ నెంబర్ కోసం తారక్ ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చుచేసి ఈ ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకుంటారనేది గతంలో నిరూపితమైంది.
ఈ నేపథ్యంలోనే ఈ కొత్త కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం
ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేయగా, జూనియర్ ఎన్టీఆర్ TS 09 FS 9999 నంబర్ కోసం దాదాపు రూ. 17 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఇష్టమైన కారు కొన్న తర్వాత తన సెంటిమెంట్ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈ మొత్తంలో ఖర్చు చేయడం విశేషం. గతంలో కూడా తన ఫ్యాన్సీ నెంబర్ కోసం 10 లక్షలు ఖర్చు చేసి నెంబర్ దక్కించుకున్న తారక్ ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టారని తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్ బిడ్ అని అధికారులు వెల్లడించారు. కేవలం తారక్ కార్ల నెంబర్లు మాత్రమే కాకుండా ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అని ఉండటం గమనార్హం.































