Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వాచ్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఈయన ఎప్పుడు కూడా ఖరీదైన వాచ్ లను దరిస్తూ ఉంటారు. ఇలా వాచ్ ల కోసమే ఎన్టీఆర్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారనే విషయం కూడా మనకు తెలిసిందే.ఇకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ లో నిలిచి ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో చిత్ర బృందం గత పది రోజులుగా అమెరికాలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా ప్రతి కార్యక్రమానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్ లో అటెండ్ అవుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్నటువంటి చిత్ర బృందానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఆర్ చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఈ పార్టీలో భాగంగా ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు ముఖ్యంగా ఈయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంత అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంత అసలు అది ఏ బ్రాండ్ అనే విషయానికి వస్తే…

Jr NTR: కోట్లు విలువ చేస్తున్న వాచ్ ధర..
యంగ్ టైగర్ పెట్టుకున్న చేతి గడియారం Patek Phillipe Nautilus Travel Time (95990/1A-001 Stainless Steel) – దీని ధర అక్షరాలా రూ. 1 కోటి 56 లక్షల 13,155.. (190,000 డాలర్స్) ఇంత రేటు అంటే ఇక అందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయో అర్థం అవుతుంది ఏది ఏమైనా ఒక వాచ్ కోసం ఇలా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఎలా ఎన్టీఆర్ వాచ్ ధర తెలిసినటువంటి అభిమానులు ఒకింత షాక్ కి గురవుతున్నారు.



























