Jr.Ntr: ఎన్టీఆర్ సినిమాలలో సక్సెస్ కాకపోతే ఏమయ్యావారో తెలుసా… మరీ సినిమాలంటే ఇంత పిచ్చినా?

0
22

Jr.Ntr: నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఒకవేళ ఇండస్ట్రీ లోకి రాకపోతే ఏమయ్యే వారు అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

నటన అంటే ఎంతో ఆసక్తి కనబరిచే ఎన్టీఆర్ ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో కనుక సక్సెస్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు,జీవితంలో ఎలా స్థిరపడేవారని సందేహాలు చాలామందికి తలెత్తుతూ ఉంటాయి. అయితే ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో కనుక సక్సెస్ కాకపోతే తాను ఇండస్ట్రీలోనే కొనసాగే వాడినంటూ తెలియజేశారు.

తనకు సినిమాలు అంటే చాలా ఇష్టం అందుకే ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఉండే వాడినని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన సినీ కెరియర్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కి సినిమాలు అంటే ఎంత పిచ్చి ఉందో అర్థం అవుతుంది.

Jr.Ntr: ఇండస్ట్రీలోని చిన్న పని చేసుకునే వాడిని..


ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాలో విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటించబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ పనులు జరుపుకోవాలని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నారు.