NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ప్రాపర్టీ విషయంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీ విషయంలో వివాదాలు రావడంతో కోర్టులో ఈ వివాదానికి పరిష్కారం కోసం పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు.

ఈ విధంగా ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి ఈ స్థలాన్ని సుంకు గీత 1996లోనే బ్యాంకులో తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం పొందింది. ఇలా తీసుకున్న రుణాలను కట్టకుండా ఎగ్గొట్టారు.దాంతో ఎస్‌బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్‌స్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి.
ఈ విషయంపై విచారణ జరిపినటువంటి డీఆర్‌టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని వెల్లడించారు. ఈ విధమైనటువంటి తీర్పు రావడంతో ఎన్టీఆర్ ఆ స్థలం కోల్పోవడమే కాకుండా ఆ స్థలంలో కట్టినటువంటి ఇల్లును కూడా కోల్పోయే పరిస్థితిలు ఏర్పడ్డాయి దీంతో ఆయన ఈ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోట్ల విలువ..
ఈ వివాదాన్ని పరిశీలిస్తే ఎన్టీఆర్ సుంకు గీత అనే మహిళ చేతిలో ఘోరంగా మోసపోయారని తెలుస్తుంది. ఈ ప్రాపర్టీ విలువ కొన్ని కోట్లలో ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ ప్రాపర్టీని తన సొంతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



























