Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నందమూరి కుటుంబం నుండి హీరోగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ కి నందమూరి కుటుంబం నుండి సపోర్టు లభించకపోయినా కూడా ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఇదిగాడు. అంతేకాకుండా ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన మన సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా విదేశీ దర్శకులు కూడా ప్రశంసల కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. తోటి నటీనటులతో పాటు దర్శక నిర్మాతలతో కూడా ఎన్టీఆర్ కి మంచి స్నేహబంధం ఉంది. ముఖ్యంగా తనతో కలిసి పనిచేసిన దర్శకులతో ఎన్టీఆర్ ఎంతో సన్నిహితంగా ఉంటాడు. ముఖ్యంగా రాజమౌళితో ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి ఎన్టీఆర్ రాజమౌళి మధ్య స్నేహం ఏర్పడింది. అలా వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇక కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ఎన్టీఆర్ కి తన తల్లి, భార్య అంటే అమితమైన ప్రేమ ఉంది. అయితే వారి తర్వాత ఎన్టీఆర్ ప్రాణంగా భావించి మరొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నారు.

Jr NTR: నాని కోసం ప్రాణాలైనా ఇస్తాను…
అతను మరెవరో కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న కొడాలి నాని. ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఎన్టీఆర్ చిన్నప్పటినుండి కొడాలి నాని కి మంచి స్నేహితుడు. వారి దారులు వేరైనా కూడా వారి స్నేహబంధం మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గతంలో కొడాలి నానితో ఉన్న స్నేహబంధం గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన జీవితంలో ప్రాణం కన్నా ఎక్కువ గా భావించి నేను ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






























