Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు వారసులిగా ఎంతోమంది నందమూరి కుటుంబం నుండి హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే వారిలో కేవలం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. మిగిలిన వారు ఇప్పటికీ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొంది నందమూరి కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతలు రెట్టింపు చేస్తున్నాడు. అయితే నందమూరి కుటుంబం నుండి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోగాటానికి అతనిలో ఉన్న ఆ ఒక్క లక్షణమే కారణం. సాధారణంగా ఎంత డబ్బు పలుకుబడి ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టపడే తత్వం టాలెంట్ చాలా అవసరం.
జూనియర్ ఎన్టీఆర్ తన తాత, తండ్రి ప్రోత్సాహంతో బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందటానికి అతనికి ఉన్న కష్టపడే గుణమే కారణం. జూనియర్ ఎన్టీఆర్ కి చిన్ననాటి నుండి కుటుంబ సభ్యుల ఉత్సాహం లభించలేదు. కేవలం తన తల్లి ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి డాన్స్ నేర్చుకొని హీరోగా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

Jr.NTR: కష్టపడేతత్వం….
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ ఎంతో కష్టపడి స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ పనులలో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.