Rajamouli : సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత గతంలో జరిగిన కొన్ని విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ మొదటి సినిమాకే ఇలాంటి వాడు హీరోగా దక్కాడేంటి, ఇది నా కర్మ అని భావించారట. అయినా కుంటి గుర్రంతో రేసులో నెగ్గితే ఇంకా గొప్పగా ఉంటుందని రాజమౌళి భావించారట.హీరో బాగా లేకపోయినా మనం సినిమా బాగా చేస్తే మనకే మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ సినిమాని తీశానని వెల్లడించారు.

Jr. NTR: ఆ కుంటి గుర్రమే పాన్ ఇండియా స్టార్ అయ్యారు…
ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై తీవ్రస్థాయిలో మండిపడటమే కాకుండా ఆయనని ట్రోల్ చేస్తున్నారు.ఒకప్పటి ఆ కుంటి గుర్రమే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు అంటూ పెద్ద ఎత్తున రాజమౌళి పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


































