Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఎన్టీఆర్ నటన మాత్రమే కాకుండా క్రికెట్ కూడా బాగా ఆడతారనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా నటన క్రికెట్ మాత్రమే కాకుండా ఈయన మరో ఆటోలో కూడా బాగా తోపు అని ఆటలో కూడా వెల్ ప్రొఫెషనల్ అంటూ తాజాగా నటుడు సుధీర్ బాబు ఎన్టీఆర్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బ్యాట్మెంటన్ ఆడటంలో జూనియర్ ఎన్టీఆర్ తోపు అని సుధీర్ బాబు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ ఎక్కువగా ఆడేవారని ఆయన కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడైనా బాడ్మింటన్ ఆడుతున్నారని తెలిస్తే కనుక అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేవారు అంటూ సుధీర్ బాబు తెలిపారు. ఇలా బ్యాడ్మింటన్ ఆడుతూ ఈయన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి మధ్య మధ్యలో తొడ కూడా కొడుతుంటారని సుధీర్ బాబు తెలిపారు.
బాడ్మింటన్ ప్లేయర్…
ఇలా ఎన్టీఆర్ లో దాగి ఉన్నటువంటి ఈ టాలెంట్ బయటపడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి డాన్సర్ అని అలాగే మంచి ప్లేయర్ అని కూడా తెలియడంతో మల్టీ టాలెంటెడ్ అంటూ ఈయనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
































