రాజకీయం, సినిమా, మీడియా.. ముఖ్యంగా ఈ మూడు రంగాల్లో ఒక మనిషి తన స్వశక్తితో పైకి ఎదుగుతున్నాడంటే.. ఆ రంగాల్లో ఉండే చాలామంది కిందకి లాగాలని చూస్తారు.. అక్కడితో ఆగకుండా అతడిపై లేనిపోని ఆరోపణలు చేసి ఏదో ఒక సమస్యలో ఇరికిస్తుంటారు.. అలాంటి సంఘటనే ఇప్పుడు మీడియా రంగంలో చర్చనీయాంశంగా మారింది..

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మీడియా ఛానెల్ Ntv కి స్థాపకుడు తుమ్మల నరేంద్ర చౌదరి.. మీడియా రంగానికి ఎనలేని సేవలను అందించారు..అంతేకాదు జర్నలిజానికి నిలువెత్తు రూపంగా ఆయనని అభివర్ణిస్తారు పాత్రికేయులు..ఇక మీడియా రంగంలో NTV, ప్రప్రథమ తెలుగు భక్తి ప్రధాన ఛానల్ భక్తి టీవీ, మరియు మహిళా సాధికారత కొరకు వనిత tv ని స్థాపించి అనేక మందికి మార్గదర్శకులయ్యారు..

అలాంటి అయన పై బురదచల్లే ప్రయత్న చేస్తున్నారు.. అయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులు దౌర్జన్యంగా బనాయించి అయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్న చేస్తున్నారు.. ప్రధానంగా ఓ స్కాం లో అయన పేరు ఎక్కువగా వినపడుతుంది.. అదే జూబ్లీ హిల్స్ స్కాం.. ఇప్పటివరకు క్లీన్ గా ఉన్న చౌదరి గారి పేరు తెర మీదకు హఠాత్తుగా రావడానికి అనేక కారణాలున్నాయి. మొన్నమొన్నటి వరకు తుమ్మల నరేంద్ర చౌదరి అధ్యక్షతలో ఉంది జూబిలీ హిల్స్ కో అపరేటివ్ సొసైటీ ప్యానెల్.. కానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో tv5 ప్యానెల్ గెలుపొందింది.. కాగా ఈ పోటీలో తుమ్మల నరేంద్ర చౌదరి పాల్గొనలేదు..

అయన బలపరిచిన ప్యానెల్ ఓడిపోయింది. అయితే అసలు సంగతి ఇక్కడే మొదలైంది.. గత నెల చివరి వరకు ఈ స్కాం కు సంభందించి ఎటువంటి మూలాలు లేవు కానీ హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక నరేంద్ర చౌదరి మీద కొంత మంది పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నం లో భాగంగా జరిగిన కుట్రకు పునాది తెలుస్తుంది..జూబ్లీహిల్స్ కో అపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన tv5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర నాథ్, నరేంద్ర చౌదరి పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన టి. హనుమంతరావు పైన భూ కబ్జా కింద కేసు పెట్టడం జరిగింది.

అది కూడా జూబిలీ హిల్స్ కో అపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో tv5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర నాథ్, ప్యానెల్ గెలిచిన తరువాత నరేంద్ర చౌదరి పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన టి. హనుమంతరావు పైన భూ కబ్జా కింద కేసు పెట్టడం జరిగింది .. అంతకుముందు ఈ కేసు ఎక్కడికిపోయింది అని ప్రశ్నిస్తున్నారు సామాన్య జనాలు.. ఇక మరోవైపు ఆయన్ని అభిమానించే జనాలు మాత్రం ఎంతమంది ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలనీ చూసినా దాన్ని ఎదుర్కొని నిలబడతారు తప్పా కృంగిపోరని అంటున్నారు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here