Jyothi Reddy: సినీ పరిశ్రమల్లో రాణిద్దామనకుంది… కానీ అనుహ్యంగా రైలు ప్రమాదంలో మరణించింది. అనుకోని ఘటన, నిద్రమత్తు నుంచి తేలుకోకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి(26) మరణించింది. వివరాల్లోకి వెళితే… సొంతూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జ్యోతి రెడ్డి రైలు ప్రమాదంలో మరణించింది.

షాద్ నగర్ స్టేషన్ లో రైలు దిగి ఎక్కుతుండగా.. జ్యోతి ఫ్లాట్ ఫామ్ పై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో మరణించింది. జ్యోతి రెడ్డి ఓవైపు జూనియర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది.

సంక్రాంతి పండగ సందర్భంగా.. ఇటీవల సొంతూరు ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి వెళ్లింది. పండగను ముగించుకుని సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూర్ నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుగు ప్రయాణం అయింది. రైల్వేకోడూర్ లో ఎక్కి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయింది.
రైలు ఎక్కలేక, అప్పటికే నిద్రమత్తులో..
అయితే తెల్లవారుజామున 5.30 గంటలకు షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగింది. అయితే కాచిగూడ అనుకుని షాద్ నగర్ లో దిగడం.. ఆ తరువాత కాచిగూడ కాదని తెలుసుకుని కదులుతున్న రైలులో ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు ఎక్కలేక, అప్పటికే నిద్రమత్తులో ఉండటంతో ఫ్లాట్ ఫామ్ మీద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో గాయపడింది. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం జ్యోతి రెడ్డిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే జ్యోతిరెడ్డి మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మృతి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్ది.. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమె మృతదేహాన్ని పోస్టుఆహెమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు































