Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈయన తెలుగు సినీ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్లు కూడా చర్చించుకునే స్థాయికి ఎదిగారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న రాజమౌళి డాక్యుమెంటరీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రసారం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరిట ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో భాగంగా పలువురు సెలబ్రిటీలో రాజమౌళి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రాజమౌళికి కొంచెం కూడా సానుభూతి లేదని తెలిపారు. ఆయన ఓ సినిమా పిచ్చోడు ఆయనకు కావలసింది ఇచ్చి మనం వెళ్ళిపోవడమే అని తెలిపారు. ఇప్పటివరకు ఎవరు పరిచయం చేయని కథలను పరిచయం చేయడం కోసమే రాజమౌళి జన్మించారని తెలిపారు.
పని రాక్షసుడు..
ఇక రాంచరణ్ మాట్లాడుతూ.. రాజమౌళి గారి సినిమాలలో నన్ను నేను చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడినని తెలిపారు. ఇక ప్రభాస్ కూడా రాజమౌళి గురించి మాట్లాడారు. రాజమౌళి గారి లాంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు ఆయనకు సినిమాలు అంటే పిచ్చ ప్రేమ అని తెలిపారు. ఇక రమా రాజమౌళి కూడా మాట్లాడుతూ ఇప్పటివరకు రాజమౌళి గారితో పనిచేసిన వారందరూ ఆయనని పని రాక్షసుడు అంటారు అంటూ ఈమె వెల్లడించారు. ఇలా సెలబ్రిటీలందరూ రాజమౌళి గురించి చెబుతున్నటువంటి ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
































