K. Viswanath: గత కొన్ని రోజుల నుండి సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, జమున, వాణిజయరామ్ ఇలా వరుస మరణాలు చోటు చేసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగింది. ఈ ఘటనలు మరువకముందే కళాతపస్వి విశ్వనాధ్ మరణించిన సంగతి ఇండస్ట్రీ మరింత కన్నీటి శోకంలో మునిగింది.

ఈయనతో ఒక శకం ముగిసింది. ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ పెద్దదిక్కుని కోల్పోయినట్లుగా మిగిలింది. ఇక ఈయన మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరువలేకపోతున్నారు. ఇక ఈయనతో కలిసి పని చేసిన నటీనటులు కూడా ఇప్పటికీ ఆయనను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.
తాజాగా సినిమాలో నటించిన ఒకప్పటి నటి సబితా ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన గురించి తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తను ఆ మధ్య కెనడా వెళ్తూ ఆయనను కలిసి వెళ్లాను అని.. తిరిగి వచ్చాక కూడా కలిశాను అని తెలిపింది. ఇక ఇంతకాలం ఎక్కడికి వెళ్లావు అని ఆయన అడగడంతో.. మీకు చెప్పి వెళ్లాను కదా గురువుగారు అని అనటంతో తనకు గుర్తుకులేదు అని అన్నాడట.

K. Viswanath:
ఇక ఆయనతో గతం లో మాట్లాడిన విషయాల గురించి తెలిపింది. ఇక తనకు సప్తపది సినిమాలో అవకాశం ఇచ్చారని.. ఆ సమయంలో తను భయపడితే ధైర్యం ఇచ్చాడని తెలిపింది. ఆ సినిమా చేయటం తన అదృష్టమని తెలిపింది. ఇక ఆయనను చూసేందుకు ఎప్పుడైనా వెళ్తే.. ఈ సినిమాలోని డాన్స్ మరోసారి చేయించుకునేవారు అని.. కానీ ఇప్పుడు ఆయనను చూడలేను అంటూ ఎమోషనల్ అయింది. ఇక ఆయన గురించి మరికొన్ని విషయాలు పంచుకుంది.
































