KA Paul – Pawan Kalyan: గత ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో సంచలనగా మారిన పాల్ ప్రజాశాంతి పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు.అయితే కొంతకాలం పాటు రాజకీయాలలో హడావిడి చేసిన పాల్ మధ్యలో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారని ఈ క్రమంలోని తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో పర్యటిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పవన్ కళ్యాణ్ సైతం తన పార్టీని పూర్తిగా ప్రజలలోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఈ విధంగా రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి పాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అయితే పవన్ కళ్యాణ్ ను అన్ని పార్టీల వారు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని పాల్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మంత్రి సీఎం కావాలన్నా ఆయన నా దగ్గరకు వస్తే తనని సీఎంని చేస్తానంటూ పాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా తమ్ముడు నిన్ను అందరూ మోసం చేస్తున్నారు నువ్వు నా దగ్గరికి వచ్చేయ్ అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
KA Paul -Pawan Kalyan:వచ్చే ఎన్నికలలో కూడా జగన్ గెలుస్తారు…
పాల్ కేవలం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాకుండా జగన్ గురించి కూడా షాకింగ్ కామెంట్ చేశారు.జగన్ కి దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయని వచ్చే ఎన్నికలలో కూడా తాను గెలుస్తారని ఈయన పేర్కొన్నారు. ఇక తాను జగన్ ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని లేదా జగన్ అయినా కూడా తనని కలవచ్చు అంటూ ఈ సందర్భంగా ఫాల్ కామెంట్ చేశారు. అయితే ఈసారి ఎన్నికలలో తాను తెలంగాణ నుంచి పోటీ చేసి కేసీఆర్ ను గద్దె దించుతానని ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
































