Kajal Agarwal: కాజల్ అగర్వాల్ వెండితెర చందమామగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె చందమామతో మంచి సక్సెస్ అందుకున్నారు. అప్పటినుంచి ఈమెకు ముద్దుగా చందమామ అని పేరు కూడా పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత మగధీరతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయారు.

ఈ సినిమా ద్వారా తెలుగులో వరుసగా అవకాశాలు అందుకున్న కాజల్ ఓ దశాబ్దం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చారు దీంతో అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పలు సినిమా అవకాశాలను అందుకొని ఈమె కెరియర్ పట్ల బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ గురించి గతంలో ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక బడా ప్రొడ్యూసర్ కొడుకుతో పీకల్లోకి ప్రేమలో మునిగిపోయిందని ఆయన రిజెక్ట్ చేస్తేనే గౌతమ్ ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవడం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. మరి ఆ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు ఎవరనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు దగ్గుబాటి రానా.

రానా ప్రేమలో కాజల్..
గతంలో రానా కాజల్ ప్రేమలో పడ్డారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి వీరిద్దరూ కలిసి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించారు ఈ సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించడంతో ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. నిజానికి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. ఇక గౌతమ్ తనకు చిన్ననాటి స్నేహితుడు అనే విషయాన్ని కాజల్ పలు సందర్భాలలో తెలిపారు. ఇలా కాజల్ గౌతమ్ ను ఎప్పటినుంచో ప్రేమిస్తూ ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లింది. ప్రస్తుతం ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

























