టాలీవుడ్ దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబినేషన్ లో చాలా రోజుల కిందటే ఇండియన్ 2 సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అప్పటి నుంచి వరుసగా ఈ సినిమాకు అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొదట షూటింగ్ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి అందులో చిత్ర యూనిట్ సభ్యులు మరణించారు.ఇందులో దర్శకుడు శంకర్ కూడా గాయపడ్డారు.

అనంతరం దర్శకుడు శంకర్ కు, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక చివరికి చర్చలు ఫలించడంతో ఈ సినిమా తిరిగి ప్రారంభం కానుంది. ఇక దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు శంకర్. డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఇండియన్ 2 చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి చాలవన్నట్టు తాజాగా శంకర్ కి మరొక సమస్య వచ్చి పడింది. ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో డేట్లు అడ్జెస్ట్ చేయలేక హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కాజల్ ప్లేస్ లోకి హీరోయిన్ త్రిషను శంకర్ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో ఇప్పటి వరకు కాజల్ పై చిత్రీకరించిన సన్నివేశాలు అన్నింటిని, త్రిషతో మళ్లీ రీషూట్ చేయాల్సి ఉంది. అలాగే నటుడు వివేక్ కూడా మరణించడంతో ఆయన సన్నివేశాలన్ని కూడా వేరొక నటుడితో రీ షూట్ చేయక తప్పడం లేదు. పాతికేళ్ల కిందట శంకర్ కమలహాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఉపేంద్ర సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించారు. దాదాపుగా ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది.































