Star Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలి అంటే చాలా కష్టం. ఒక్కసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత అవకాశాలను అందుకోవడం కోసం ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తుంది. ఇలా ఎన్నో అవమానాలు హేళనలను తట్టుకొని నిలబడితే సక్సెస్ తప్పకుండా వరిస్తుందని ఎంతోమంది సెలబ్రిటీలు రుజువు చేశారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నిర్మాతగా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అయిన ఓ వ్యక్తి కుమార్తె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. అయితే 17 ఏళ్ల వయసులో ఆమె కాస్త శరీర బరువు ఉండటం, నల్లగా ఉండడంతో చాలామంది ఆమె రంగు శరీర బరువుపై హేళనలు చేశారు.

ఇలా తనని ఎంతో అవమానకరంగా మాట్లాడిన ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. మరి ఇలాంటి అవమానాలను ఎదుర్కొని సక్సెస్ సాధించిన ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని వస్తే ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ కాజోల్. ఈమె నేడు తన 50 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

ఇలా తన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ లో తనకు ఎదురైన అవమానాలకు సంబంధించిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా కెరియర్ మొదట్లో నన్ను చూసి చాలామంది అవమానించారు ఆ సమయంలో చాలా బాధపడ్డాను ఇలా అవమానాలను ఎదుర్కొన్న తర్వాత విసుగు చెందిన ఆమె తనను తాను అద్దంలో చూసుకోవడం ప్రారంభించిందని , తాను చాలా అందంగా ఉన్నానని తనను తాను ఒప్పించానని చెప్పింది.
స్కిన్ ట్రీట్మెంట్..
ఇలా తాను ఒకప్పుడు నల్లగా ఉండి ఒక్కసారిగా అందంగా తయారు కావడంతో నా అందంపై కూడా విమర్శలు వచ్చాయి. తెల్లగా కనిపించడం కోసం స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నానని విమర్శించారు. నిజానికి తాను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు ఒకప్పుడు ఎండలో షూటింగ్ చేస్తూ అలా ఉండేదాన్ని కానీ షూటింగ్స్ లేకుండా ఇంటిలో ఉండటం వల్ల తన రూపురేఖలు కూడా మారిపోయాయని ఈమె వివరణ ఇచ్చుకున్నారు.



























