Kakinada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామల గా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఇలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండి తెర బుల్లితెర కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించారు.

భర్తను మగాడివి కాదు అని తిట్టేదాన్ని…
నాటకరంగం నుండి సినిమాల్లోకి వెళ్లిన కాకినాడ శ్యామల సినిమాలను బాగా చేస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకున్న ఆమె తన భర్త గురించి మాట్లాడారు. తన భర్తకు 600 ఎకరాల భూమి తన వాటగా వస్తే మొత్తం కరింగించి 30 ఎకరాలను చేశాడంటూ చెప్పారు. కుటుంబాన్ని పోషించకుండా జల్సా చేస్తూ తిరగడం వల్ల మగాడివైతే నాలుగు డబ్బులు సంపాదించుకుని రా అలాంటి వాళ్ళను మగాడు అని నేను అంటాను అని భర్తను తిట్టేవారట శ్యామల . చెన్నై లో ఉన్నపుడు క్లబ్ కి వెళ్ళేవాడని అలా ఆస్తి మొత్తం కరిగించడంటూ చెప్పారు.

ఇక ట్రావెల్స్ వ్యాపారం చెసినా అందులోనూ నష్టాలను చూసి అమ్మేసి, మళ్ళీ షిప్ యార్డ్ లో కొన్ని షాప్స్ కొని వ్యాపారం చేసారంటూ చెప్పారు. అయితే ఇక ఆయన మరణించాక ఆయన ఆస్తిగా మిగిలిన 30 ఎకరాలను అమ్మి హైదరాబాద్ లో ఇల్లు కొనుకున్నాను అంటూ చెప్పారు. కానీ ఆ భూమి విషయంలో బాగా కోర్టుకి తిరగాల్సి వచ్చిందని తన భర్త అన్న కొడుకు ఆస్తి తనదంటూ గొడవ పడటంవల్ల ఇబ్బందులు పడినా చివరకు కోర్ట్ ద్వారా భూమి దక్కించుకున్నానని చెప్పారు.
































