Amitabh Bachchan: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల చిత్ర బృందం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముందుగా నాగీ ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ సినిమాలో నా పాత్ర ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది చెప్పటానికి కొన్ని ఫొటోస్ చూపించారు.
ఇక ఇందులో నేను ప్రభాస్ ను కొట్టే పాత్రలో నటించారు. అయితే దీనిని ప్రభాస్ అభిమానులు ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకుని నన్ను ట్రోల్ చేయొద్దు. ప్రభాస్ ను కొట్టినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈయన క్షమాపణలు చెప్పారు.
ప్రభాస్ ను కొట్టాను..
ఈ విధంగా అమితాబ్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. అయ్యో సార్ నా అభిమానులంతా కూడా మీకు అభిమానులే అంటూ ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.



























