Nag Aswin: కల్కి సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈయన చేసింది మూడు సినిమాలు అయినప్పటికీ మూడవ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తోంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు ఈయన ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. అయితే ఇటీవల ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూటమి అధికారంలోకి రావడమే కాకుండా కూటమి అధికారంలోకి రావాలని చిత్ర పరిశ్రమ కూడా ఎంతో ఆకాంక్షించింది. ఇక చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇకపోతే టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసే సినిమా టికెట్ల రేట్లు పెంచాలని కోరగా ఒకేసారి భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు సినిమాని చూసే ఆనంద పడాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈ విషయంలో నిర్మాతలు అందరూ కూడా వైయస్ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హ్యాపీగా ఉంది..
ఇకపోతే ఈ మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్ డైరెక్టర్ ను ప్రశ్నిస్తూ ఒకవేళ ఏపీలో జగన్ తిరిగి విజయం సాధించి ఉంటే .. అప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగేవి కాదు కదా..అప్పుడు మీ పరిస్థితి ఏంటనే ప్రశ్న నాగ్ అశ్విన్‌కు ఎదురైంది. అలా జరగలేదు కాబట్టే ఫుల్ హ్యాపీగా ఉన్నామని నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానం సంచలనగా మారింది. జగన్ ఓడిపోవడంతో తామంతా హ్యాపీగా ఉన్నామని ఈ సందర్భంగా ఈయన చెప్పకనే చెప్పేశారు..



























