Kalki: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి ఇకపోతే ఏపీలో ఇప్పటివరకు టికెట్ల రేట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు.
అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కాలేదు అయితే నిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఈ భేటీలో భాగంగా సినిమా టికెట్ల రేట్లు గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే కల్కి సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదనపు షోలకు అనుమతి..
ఇక కల్కి సినిమా విడుదలైన తర్వాత సింగిల్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయలను రెండు వారాలు పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా రోజుకు ఐదు షోలు వేసుకొనే అనుమతి కూడా తెలియజేయడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



























